అల్లు అర్జున్ ..  పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `అల.. వైకుంఠపురములో`. త్రివిక్రమ్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్- గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా రిలీజవుతోంది.

ఇంకో పన్నెండు రోజులే సమయం ఉంది. ఇప్పటికే చిత్ర బృందం డిసెంబర్ ఆద్యంతం అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చింది. దసరా- దీపావళి- క్రిస్మస్ అంటూ నిరంతరం ఫ్యాన్స్ కోసం ఏదో ఒక తాయిలం విసిరేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పాటలు చార్ట్ బస్టర్ అంటూ టాక్ వచ్చింది. థమన్ ఈసారి జోష్ ఉన్న పాటల్ని అందించాడని క్రియేటివిటీ పాళ్లు పెరిగాయని ప్రశంసలు కురుస్తున్నాయి. మొత్తానికి థమన్ తో పని చేయించుకునే ట్యాలెంటు దర్శకులకు ఉండాలి కానీ! అని ప్రూవ్ అయ్యింది.

ఇక సామజవరగమన `అల.. ` ఆల్బమ్ కే హైలైట్. ఈ పాట తోనే మ్యూజిక్ ని పీక్స్ కి తీసుకెళ్లాడు. తాజాగా సామజవరగమన ప్రీటీజర్ ని రిలీజ్ చేశారు. డిసెంబర్ 31న పాట ప్రోమోను రిలీజ్ చేయనున్నమాని టీమ్ ప్రకటించింది. ఇక ఈ టీజర్ లో అల.. గ్లింప్స్ మైమరిపించాయి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ఫ్రాన్స్ లో అద్భుతమైన లొకేషన్లలో తెరకెక్కించారు. సామజవరగమన 2020 చార్ట్ బస్టర్ హిట్స్ లో నంబర్ వన్ స్థానంలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక 2020 థమన్ నామ సంవత్సరం గానూ ఇప్పటికే అభిమానులు డిక్లేర్ చేసేస్తున్నారు. 2019-20 సీజన్ థమన్ కి అంకితం. ఇదే ఊపు లో కొత్త ఏపీ రాజధాని బీచ్ సొగసుల విశాఖ లో భీమిలి లో స్టూడియో నిర్మాణానికి థమన్ ప్లాన్ చేస్తున్నాడన్న ప్రచారం హీటెక్కిస్తోంది.