స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న విడుదల కానుంది. ఇదిలావుండగా, తాజా సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ జనవరి 6 న జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్ లోని యూసఫ్ గుడా పోలీస్ గ్రౌండ్ లో జరుగుతుంది.
ఈ చిత్రంలో కథానాయికలు పూజా హెగ్డే, నివేత పేతురేజ్ తో పాటు టబు,జయరామ్, సముద్రకని, నవదీప్, సుశాంత్,మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Leave a Reply