• మహేష్ తన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదలకు ముందు మహారాష్ట్రలోని షిర్డీ ని సందర్శించారు. కుటుంబం సమేతంగా ఆయన షిర్డీ చేరుకొని లార్డ్ సాయి బాబా కు ప్రార్థనలు చేశారు. ఈనెల 27న ఎయిర్ పోర్ట్ లో మహేష్ ఫ్యామిలీ తో కనిపించడంతో ఆయన వరల్డ్ టూర్ కి వెళ్లారని అందరూ భావించారు. ఐతే సడన్ గా షిర్డీ క్షేత్రంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈయనతో దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఉన్నారు. కాగా రేపు సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి చివరి సాంగ్ రానుంది. డిసెంబర్ నెలలో ప్రతి సోమవారం ఒక కొత్త సాంగ్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు వచ్చే నెల 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మహేష్ సరసన మొదటి సారి రష్మిక మందాన నటిస్తుంది. ఈ చిత్రంలో చాలా కాలం తరువాత విజయ శాంతి ఓ కీలక రోల్ చేయడం గమనార్హం. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply