హీరో శర్వానంద్ పక్కా పల్లెటూరి రైతు బిడ్డ పాత్ర చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం శ్రీకారం మూవీలో శర్వా పల్లెటూరి యువకుడి పాత్ర చేస్తున్నారు. దర్శకుడు కిషోర్ బి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శ్రీకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్, శర్వా నంద్ కి జంటగా ఈ చిత్రంలో నటిస్తుంది. కాగా నేడు ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు.

ఈ ఏడాది ఏఫ్రిల్ 24న వేసవి కానుకగా శ్రీకారం మూవీ విడుదల కానుంది. శ్రీకారం చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. కాగా శర్వానంద్ లేటెస్ట్ మూవీ జాను విడుదలకు సిద్ధమైంది. సమంత హీరోయిన్ గా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. జాను చిత్రానికి సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా, గోవింద్ వసంత్ సంగీతం అందించారు. జాను తమిళ చిత్రం 96 కి తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

Leave a Reply