విక్టరీ వెంకటేష్ ప్రజెంట్ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఈ సినిమాను అన్ని విధాలా ఒరిజినల్ వెర్షన్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నటీనటుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకటేష్ సతీమణిగా ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుండగా రెండవ హీరోయిన్ పాత్ర కోసం మలయాళ నటిని తీసుకున్నారు.

ఆమే రెబ్బ మోనిక జాన్. మలయాళం, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈమె ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విజయ్ యొక్క ‘బిగిల్’ చిత్రంలో మహిళా ఫుట్ బాల్ జట్టులో ఒకరిగా నటించి మెప్పించింది. ఈ సినిమా తెలుగులో ‘విజిల్’ పేరుతో రావడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ‘నారప్ప’లో ఫ్లాష్ బ్యాక్లో ఈమె వెంకీకి జోడీగా కనిపించనుంది.

Leave a Reply