నటుడు సునీల్ మొదట జర్నీని హాస్య నటుడిగానే ప్రారంభించి కొన్నాళ్లకు హీరోగా మారారు. హీరోగా కూడా మంచి విజయాల్ని అందుకున్న ఆయన మళ్లీ హాస్య నటుడిగా మారి సినిమాలు చేశారు. ఇలా కెరీర్ ను పలు మలుపులు తిప్పుకున్న ఆయన ఈసారి ఇంకో భిన్నమైన టర్న్ తీసుకున్నారు. ఇన్నాళ్ళు హాస్యనటుడిగా, కథానాయకుడిగా అలరించిన ఆయన ప్రటినాయకుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.

నటుడు సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘కలర్ ఫోటో’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ ప్రేమ కథలో సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తారట. మరి సునీల్ తీసుకుంటున్న ఈ కొట్ట టర్న్ ఎలా ఉంటుందో చూడాలి. సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే నాని చేతుల మీదుగా లాంచ్ అవుతోంది.

Leave a Reply