సంక్రాంతి చిత్రం సరిలేరు నీకెవ్వరు తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. సరిలేరు నీకెవ్వరు అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా నమోదు చేసింది. కాగా మహేష్ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సూపర్ హిట్ కావంతో మళ్ళీ మహేష్ ఆయనతో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. కాగా మహేష్ 27వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర హీరోయిన్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది.

ఈ చిత్రానికి హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకుంటున్నారట. ఆమెతో చర్చలు జరపడంతో పాటు కన్ఫర్మ్ కూడా అయ్యిందని తెలుస్తుంది. సమ్మర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుండగా వంశీ మహేష్ ని మాఫియా బ్యాగ్రౌండ్ లో ప్రజెంట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక గతంలో కియారా భరత్ అనే నేను చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మహేష్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

Leave a Reply