మహేష్ సంక్రాంతి సినిమా సరిలేరు నీకెవ్వరు ఆతనికి మరపురాని విజయాన్ని అందించింది. మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ని రూపొందించారు. అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ నయా అవతార్ ప్రేక్షకులకు భలే నచ్చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన నేపథ్యంలో మహేష్ తండ్రి గారైన కృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకరతో ముచ్చటించారు .

ఈ సంధర్భంగా సరిలేరు నీకెవ్వరు గురించి అనేక విషయాలు తెలుసుకున్న కృష్ణ గారు, మహేష్ గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మహేష్ తండ్రి కృష్ణ దర్శకత్వంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలో నటించారు. చిన్నతంలోనే సింగిల్ టేక్ లో చాలా కష్టమైన డైలాగ్స్ చెప్పడం, నటించడం చేసి అక్కడ ఉన్న అందరినీ మహేష్ ఆశ్చర్య పరిచేవాడట. మహేష్ సింగల్ టేక్ ఆర్టిస్ట్ అని ఆనాటి విషయాలను గుర్తు చేసుకుంటూ కృష్ణ పుత్రోత్సాహం అనుభవించారు. తొమ్మిది చిత్రాలలో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించగా..వాటిలో ఐదు సినిమాలకు కృష్ణ దర్శకత్వం వహించారు.

Leave a Reply