విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనవరి 20న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభించారు. దాదాపు 10రోజులుగా జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ నిన్నటితో పూర్తి అయినట్టు సమాచారం. దీనితో చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. చాలా వేగంగా సినిమాలు తీసే పూరి త్వరిత గతిన ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.

విజయ్ ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపించనున్నారు. దీని కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇక ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఫైటర్ అనే టైటిల్ పరిశీనలో ఉండగా, వేరే టైటిల్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు.

Leave a Reply