రవితేజ ప్రస్తుతం తన కొత్త మూవీ షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నాడు. తాజా షెడ్యూల్ కొరకు చిత్ర యూనిట్ చీరాల వెళ్లినట్టు తెలుస్తుంది. చీరాల లోని రామాపురం బీచ్ నందు రవితేజ క్రాక్ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు గోపి చంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా బి మధు నిర్మిస్తున్నారు. క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజకు జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన బలుపు మంచి విజయం సాధించింది.

ఇక రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై డీసెంట్ వసూళ్లు సాధిస్తుంది. దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ లో పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. ఎస్ ఆర్ టి ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై రామ్ తళ్లూరి డిస్కో రాజా చిత్రాన్ని నిర్మించారు.

Leave a Reply