పవన్ కళ్యాణ్ చకచకా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు రెండు చిత్రాల షూటింగ్ షురూ చేశారు. దిల్ రాజ్ నిర్మాతగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జనవరి 29న పవన్ తన 27వ చిత్రాన్ని మొదలుపెట్టారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పవన్ తో ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన ఏ ఎమ్ రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఐతే పవన్ తన 28వ చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితం విడులైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పవన్ పరాజయాలకు అడ్డుకట్టవేసి ఆయన్ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తెచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఇక ఈ కాంబినేషన్ మూవీ రావడం పవన్ ఫ్యాన్స్ కి పండుగ అనే చెప్పాలి.

Leave a Reply